దుబాయ్: ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లోనే కొనసాగుతున్నాడు. బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలోనూ బుమ్రా కెరీర్ బెస్ట్ 908 రేటింగ్ పాయింట్లతో నిలిచాడు.
బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన బుమ్రా గతంలో ఏ ఇండియా బౌలర్ సాధించని 907 రేటింగ్ పాయింట్లను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (841), సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ (837) వరుసగా రెండు, మూడు ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్ (847) నాలుగో ర్యాంక్‌లో ఉన్నాడు. మెన్స్ ఆల్‌రౌండర్స్ లిస్ట్‌లో రవీంద్ర జడేజా (400) నంబర్ వన్ ర్యాంక్‌ను సాధించాడు.