![టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ..చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరం](https://static.v6velugu.com/uploads/2025/02/jasprit-bumrah-ruled-out-of-champions-trophy-one-more-surprise-in-final-squad_Eou7Ljpmki.jpg)
- జస్‌ప్రీత్ స్థానంలో జట్టులోకి హర్షిత్ రాణా
- జైస్వాల్ బదులు వరుణ్ చక్రవర్తి
న్యూఢిల్లీ : చాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వెన్నుగాయం కారణంగా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా టోర్నీకి దూరమయ్యాడు. మంగళవారం వరకు ఎన్సీఏలో రిహాబిలిటేషన్‌లో ఉన్న బుమ్రా పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోయాడు. మెడికల్ పరంగా ఫిట్‌గా ఉన్నట్లు తేలినా.. బౌలింగ్ ఫిట్‌నెస్‌పై ఎన్‌సీఏ క్లియరెన్స్ ఇవ్వలేదు. దీంతో బుమ్రా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ప్రకటించారు.
బుమ్రా ప్లేస్‌లో సెలెక్షన్ కమిటీ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది. అలాగే, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది. యశస్వి, మహ్మద్ సిరాజ్, శివం దూబేను నాన్ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా ప్రకటించింది. జట్టుకు అవసరమైతే ఈ ముగ్గురూ దుబాయ్ వెళ్తారని సైకియా తెలిపారు.