టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన గాయంపై వస్తున్న ఫేక్ వార్తలపై స్పందించాడు. డాక్టర్లు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందిగా సూచించిన వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు. "ఫేక్ వార్తలను వ్యాప్తి చేయడం చాలా సులభం. ఇలాంటి వార్తలు విన్నప్పుడు నవ్వొస్తుంది. ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు". అని తన ఎక్స్ ద్వారా తెలిపాడు. అంతేకాదు నవ్వుతున్న రెండు ఎమోజీలను జత చేశాడు. బుమ్రా తన గాయంపై క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రస్తుతం బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. అతను ఎప్పుడు పూర్తిగా కోలుకుంటాడనే విషయంలో అప్ డేట్ లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికికల్లా కోలుకుంటాడని సెలక్టర్లతో పాటు.. బీసీసీఐ ఆశిస్తుంది. నెల రోజుల పాటు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి సెలక్ట్ చేయాలనీ బీసీసీఐ భావిస్తోందట. మరోవైపు గాయం కారణంగా బుమ్రా ఈ మెగా లీగ్ ప్రారంభ మ్యాచ్ లకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఆదివారం (జనవరి 19) ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించనున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టులో బుమ్రాను వెన్ను గాయం బాధించింది. దీంతో మ్యాచ్ మధ్యలోనే చికిత్స కోసం హాస్పిటల్ కు వెళ్ళాడు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయడానికి రాలేదు.ఒకవేళ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా దూరమైతే భారత్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్టే. అతన్ని రీప్లేస్ చేసే ఆటగాళ్లు ఎవరూ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ సిరీస్ లో అద్భుతంగా రాణించిన బుమ్రా 32 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
I know fake news is easy to spread but this made me laugh 😂. Sources unreliable 😂 https://t.co/nEizLdES2h
— Jasprit Bumrah (@Jaspritbumrah93) January 15, 2025