టీమిండియా స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా.. ‘ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఆఫ్ డిసెంబర్’ అవార్డు గెలుచుకున్నాడు. డిసెంబర్ నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కు ఐసీసీ అవార్డు వరించింది. ఈ అవార్డుకు బుమ్రా తో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా సీమర్ డ్వేన్ పీటర్సన్ కూడా నామినేట్ అయ్యారు. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో బుమ్రా 14.22 యావరేజ్‌తో 22 వికెట్లు తీశాడు.
ఇందులో బ్రిస్బేన్, మెల్‌బోర్న్ లో జరిగిన టెస్టు తొమ్మిది వికెట్లు తీయడంతో ఇండియా బోర్డర్–గావస్కర్ ట్రోఫీ రేసులోకి రాగలిగింది. ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో బుమ్రా 32 వికెట్లు తీసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ఆసీస్‌కు 3–1తో సిరీస్ అందించిన కమిన్స్ మూడు మ్యాచ్‌ల్లో కలిపి 17 వికెట్లు సాధించాడు. అడిలైడ్‌లో (5/57) బెస్ట్ బౌలింగ్ పెర్ఫామెన్స్ చూపెట్టాడు.
“డిసెంబరు నెలకు గాను ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికైనందుకు నేను థ్రిల్‌గా ఉంది. వ్యక్తిగత అవార్డులు ఎల్లప్పుడూ సంతోషాన్ని ఇస్తాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా నాకు ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది". అని బుమ్రా అవార్డు గెలుచుకున్న తర్వాత చెప్పుకొచ్చాడు. అంతకముందు 2024 జూలై నెలలోనూ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకున్నాడు.
ALSO READ | Ranji Trophy: 12 ఏళ్ళ తర్వాత రంజీ ట్రోఫీ స్క్వాడ్ లో విరాట్ కోహ్లీ: కన్ఫర్మ్ చేసిన ఢిల్లీ క్రికెట్ సెక్రటరీ
మహిళల విభాగంలో ఈ అవార్డును ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ సదర్లాండ్ గెలుచుకుంది. డిసెంబర్ నెలలో ఆమె భారత్, న్యూజిలాండ్‌లపై సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించింది. ఈ రెండు సిరీస్ లోనూ సదర్లాండ్ సెంచరీలు కొట్టడం విశేషం. భారత ఓపెనర్ స్మృతి మంధాన డిసెంబర్ ఈ అవార్డుకు నామినేట్ అయినప్పటికీ ఆమెకు నిరాశ తప్పలేదు.
Say hello 👋 to the ICC Men's Player of the Month for December 2024! 🔝
— BCCI (@BCCI) January 14, 2025
A round of applause for Jasprit Bumrah! 👏 👏 #TeamIndia pic.twitter.com/2ZpYHVv2L1