Jasprit Bumrah: సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు విజేత బుమ్రా

Jasprit Bumrah: సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డు విజేత బుమ్రా

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఎంపికయ్యాడు. 2024లో అద్భుత ప్రదర్శన కనపరిచిన బుమ్రా ఈ అవార్డుకు ఎంపికైనట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మంగళవారం ప్రకటించింది.

తొలి పేసర్‌.. 

అవార్డు రేసులో ట్రావిస్ హెడ్, జో రూట్, హ్యారీ బ్రూక్‌లను వెనక్కినెట్టి బుమ్రా సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు గెలిచిన తొలి భారత పేసర్‌.. బుమ్రా. ఓవరాల్‌గా తీసుకుంటే.. ఈ అవార్డు గెలిచిన ఐదవ భారత క్రికెటర్‌. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ టెండూల్కర్ (2010), రవిచంద్రన్ అశ్విన్ (2016),  విరాట్ కోహ్లీ (2017, 2018) ఈ అవార్డు అందుకున్నారు.

బుమ్రా వైట్ బాల్ క్రికెట్‌ రికార్డులు పక్కనపెడితే, రెడ్ బాల్‌ క్రికెట్‌లో అతని గణాంకాలు అసాధారణం. ఒక్క ఈ ఏడాదిలోనే 71 వికెట్లు పడగొట్టాడు. అందునా 71 వికెట్లు పడగొట్టడానికి అతడు తీసుకున్న మ్యాచ్‌లు.. 13 టెస్టులు మాత్రమే. 2024లో సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే అవార్డు అతన్ని వరించింది.

ALSO READ | Suresh Raina: ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అతనిదే: సురేష్ రైనా