బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ స్టార్ ఆటగాళ్లను గాయాలపాలు చేసింది. 5 టెస్ట్ మ్యాచ్ ల సుదీర్ఘ పర్యటనలో ఆస్ట్రేలియా కెప్టెన్ పాటు కమ్మిన్స్, టీమిండియా ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రా గాయపడ్డారు. బుమ్రా వెన్నుగాయంతో ఇబ్బంది పడుతుంటే.. చీలమండ గాయంతో ఇబ్బందిపడుతున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వచ్చే వారం స్కానింగ్‌కు వెళ్లనున్నాడు. రిపోర్ట్స్ ప్రకారం వీరిద్దరూ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట. దీంతో ఫిబ్రవరిలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి వీరిద్దరూ దూరంగా ఉండనున్నారు. ఈ సిరీస్ లో బుమ్రా 150 ఓవర్లు బౌలింగ్ చేస్తే కమ్మిన్స్ 167 ఓవర్లు బౌలింగ్ వేశాడు.
బుమ్రా భారత జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్ కాగా.. కమ్మిన్స్ ఆస్ట్రేలియా కెప్టెన్. వీరిద్దరూ దూయమైతే భారత్, ఆసీస్ జట్లకు ఎదురు దెబ్బ తగిలినట్టే. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ తో భారత్ 3 వన్డేలు, మూడు టెస్ట్ సిరీస్ లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లకు బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరిదైన ఐదో టెస్టులో రోహిత్ శర్మ స్థానంలో టీమిండియా కెప్టెన్సీ చేపట్టిన జస్‌ప్రీత్ బుమ్రా రెండో రోజు ఆటలో గాయపడ్డాడు. దీంతో ఈ ఫాస్ట్ బౌలర్ సిడ్నీ టెస్టు రెండో రోజు ఆట మధ్యలో మైదానాన్ని వీడాడు.
Also Read : ఏఎస్‌బీ క్లాసిక్ టెన్నిస్ టోర్నీ సెమీస్‌లో భాంబ్రీ జోడీ
స్కానింగ్ కోసం బుమ్రా మెడికల్ సిబ్బందితో కలిసి స్కానింగ్‌కు వెళ్ళాడు. ఇటీవలే బుమ్రా గాయం పెద్దది కావడంతో అతను ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్కానింగ్‌లో కమ్మిన్స్ గాయం తీవ్రమైందిగా తేలితే అతను చాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉండటం కష్టమే. అయితే ఈ విషయంపై మాట్లాడేందుకు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ నిరాకరించారు.
శ్రీలంకతో జరగనున్న రెండు టెస్ట్‌లకు కూడా కమిన్స్‌కు విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ కమిన్స్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే హాజిల్‌వుడ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా, కమ్మిన్స్ తో పాటు ఆకాష్ దీప్,హాజిల్‌వుడ్ గాయపడ్డారు.
Pat Cummins and Jasprit Bumrah!!#AUSvIND #ChampionsTrophy2025 pic.twitter.com/iFMHG3lXPk
— CRICKETNMORE (@cricketnmore) January 9, 2025