IPL 2024: ముంబై ఇండియన్స్ లో పాండ్యా చిచ్చు.. నీతా అంబానీపై బుమ్రా అసంతృప్తి

IPL 2024: ముంబై ఇండియన్స్ లో పాండ్యా చిచ్చు.. నీతా అంబానీపై బుమ్రా అసంతృప్తి

ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద ట్రేడింగ్ జరిగింది. గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యను ముంబై జట్టులో చేరిపోయాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు పాండ్యకు గుజరాత్ రిటైన్ చేసుకున్నట్లు తెలపడంతో ముంబై వెళ్తున్నట్లు వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది. అయితే 7 గంటలకు ట్రేడింగ్ రూపంలో పాండ్య ముంబై చెంతకు చేరడంతో అంతా షాకయ్యారు. పాండ్యను కెప్టెన్ గా చేయడానికే ముంబై జట్టులో చేర్చుకుందని జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇండియన్ స్టార్ పేసర్ బుమ్రా ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారుతుంది. 

పాండ్య ముంబై తిరిగి రావడంతో అభిమానులు పాండ్యను కెప్టెన్ చేయాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం రోహిత్ వయసు 35 సంవత్సరాలు. ఇటీవలే టీ20 ఫార్మాట్ పైట ఆసక్తి లేదని చెప్పడంతో హార్దిక్ భవిష్యత్ కెప్టెన్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే బుమ్రాలో మాత్రం కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా "కొన్ని సార్లు నిశబ్ధంగా ఉండడం తప్ప ఏమీ చేయలేము". అని పోస్ట్ చేసాడు. ముఖ్యంగా, బుమ్రా సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ అధికారిక హ్యాండిల్స్‌ను కూడా అన్‌ఫాలో చేశాడు. 

ముంబై ఇండియన్స్ తర్వాత కెప్టెన్ గా బుమ్రా అన్నట్లు గత కొంతకాలంగా వార్తలు నడిచాయి. ఆసియా కప్ కు ముందు బుమ్రా ఐర్లాండ్ తో జరిగిన టీ 20 సిరీస్ కు కెప్టెన్ గా చేసాడు. ఇంతలో పాండ్య వచ్చి చేరడంతో బుమ్రాకు నిరాశ తప్పలేదు. పాండ్యా రాకతో నీతా అంబానీ చాలా సంతోషంగా ఉన్నట్లు.. ఇది నొప్పని బుమ్రా ఆమెపై అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. అందువల్లే ఈ సేటిరికలు పోస్ట్ పెట్టాడనే మాటలు వినపడుతున్నాయి. మరి హార్దిక్ ను ముంబైలోకి తెచ్చుకోవడానికి కారణమేంటో 2024 ఐపీఎల్ కు ఒక క్లారిటీ వచ్చేస్తుంది.