Jasprit Bumrah: గాయంతో న్యూజిలాండ్‌కు బుమ్రా.. సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు సజీవం

Jasprit Bumrah: గాయంతో న్యూజిలాండ్‌కు బుమ్రా.. సిరాజ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు సజీవం

వచ్చే నెలలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా స్టార్ సాఫ్ట్ బౌలర్ జస్ప్రీత్ బౌలర్ ఆడతాడా లేదా అనే విషయంపై సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ మెగా టోర్నీకి బుమ్రా దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బుమ్రాను ఆడించాలా వద్దా అనే విషయంలో బీసీసీఐతో పాటు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు ఎటూ తేల్చుకోలేకపోతుంది. బుమ్రా ఇంకా 100 శాతం ఫిట్ నెస్ సాధించలేదని తెలుస్తుంది. 

బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు న్యూజిలాండ్‌కు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. బీసీసీఐ వైద్య బృందం ప్రస్తుతం న్యూజిలాండ్‌కు చెందిన ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవాన్ స్కౌటెన్‌తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ సమయానికల్లా బుమ్రా కోలుకోవడం అద్భుతమే అవుతుంది. ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు వన్డేలకు బుమ్రా దూరం కానున్నాడు.  ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడో వన్డేలో బుమ్రాను ఆడించే ఉద్దేశ్యంలో ఉన్నారు. అయితే బుమ్రా గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలా జరగడానికి అవకాశం లేదని తెలుస్తుంది.

ALSO READ | WI vs PAK: లెక్క సరిచేశాడు: పాక్ స్పిన్నర్‌పై తొడ గొట్టి రివెంజ్ తీర్చుకున్న విండీస్ బౌలర్

సెలెక్టర్లు ఫిబ్రవరి 11 వరకు జట్టులో మార్పులు చేయవచ్చు. ఆ సమయానికి కోలుకోలేకపోతే బుమ్రా స్థానంలో మరొకరిని ఎంపిక చేసే పనిలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ఒకవేళ గాయం కారణంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైతే అతని స్థానంలో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ లేదా హర్షిత్ రాణాలలో ఒకరిని ఎంపిక చేయవచ్చు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ప్రకటించిన భారత జట్టులో సిరాజ్ కు చోటు దక్కని విషయం తెలిసిందే.