
సతీష్ బాబు రాటకొండ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘జాతర’. దీయా రాజ్ హీరోయిన్. గల్లా మంజునాథ్ సమర్పణలో రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి నిర్మించారు. నవంబర్ 8న సినిమా రిలీజ్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటుడు శివ బాలాజీ అతిథులుగా హాజరై ట్రైలర్ ఇంటరెస్టింగ్‌గా ఉందని, సినిమా హిట్ అవ్వాలని కోరారు. విశ్వ కార్తికేయ, ధృవ వాయు టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సతీష్ బాబు మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని కథ రాశా. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో ఊరి కట్టుబాట్లు, అక్కడ జరిగే తంతులు, ఘటనలను రియలిస్టిక్‌గా చూపించాం. ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’ అన్నాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది దీయా రాజ్. అవుట్‌పుట్ బాగా వచ్చిందని, ఆడియెన్స్‌కు కచ్చితంగా నచ్చుతుందని నిర్మాత శివ శంకర్ రెడ్డి అన్నారు.