ఇండియాయాలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లో దావూద్ ఇబ్రహీం ఒకరు. 1993లో ముంబైని కుదిపేసిన వరుస బాంబు పేలుళ్లలో 250 మందికి పైగా అమాయకుల ప్రాణాలను బలిగొన్న సూత్రధారి. ఇతని ధాటికి ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు 1400 మందికి పైగా ఆ బాంబ్ బ్లాస్ట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగింది. అంతకు ముందెన్నడూ ఇండియా ఇంత పెద్ద టెర్రరిస్ట్ ఎటాక్‌ను చూడలేదు. ఆ ఘటనతో ఒక్క ఇండియానే కాదు.. మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది.
ముంబై కేంద్రంగా మొత్తం ఇండియానే వణికించిన నరరూప రాక్షసుడు గురించి పాకిస్థాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ షాకింగ్ విషయాలను వెల్లడించాడు. వరల్డ్ డాన్, పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంతో తన సంబంధాల గురించి మాట్లాడాడు. అతనితో బంధాన్ని కలిగి ఉండడం గర్వంగా ఉందని ఆయన అన్నారు. పాకిస్థానీ జర్నలిస్ట్ హసన్ నిసార్‌తో మాట్లాడుతూ.. దావూద్‌తో తనకున్న సంబంధం చాలా కాలం నాటిదని.. దావూద్ కుమార్తెతో తన కుమారుడిని వివాహం చేసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని మియాందాద్ తెలిపాడు.
"నాకు అతను చాలా కాలంగా తెలుసు. అతని కుమార్తె నా కొడుకును వివాహం చేసుకోవడం నాకు గౌరవం ఉంది. నా కోడలు చాలా బాగా చదువుకుంది. ఆమె కాన్వెంట్ పాఠశాలలో చదివి పేరు పొందిన విశ్వవిద్యాలయంలో చేరింది". అని మియాందాద్ నిసార్‌కి యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు. మియాందాద్ రెండు దశాబ్దాలకు పైగా పాకిస్థాన్ జట్టు తరపున ఆడాడు. పాక్ గొప్ప క్రికెటర్లలో అతను ఒకడు. మొత్తం ఆరు ప్రపంచ కప్‌లలో పాకిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 233 వన్డేల్లో 7381 పరుగులు..124 టెస్టుల్లో 8832 పరుగులు చేశాడు. అతని కెరీర్ లో మొత్తం 31 సెంచరీలు ఉన్నాయి.
EX-Pak cricketer Javed Miandad acknowledges family ties with Dawood Ibrahim
— IANS (@ians_india) March 19, 2024
(Video:-Hassan Nisar Vlogs)
Read:- https://t.co/pOqL3KrUtI pic.twitter.com/cYs0oxvtIX