అయోధ్య రామ మందిరానికి హిందువులుగా వెళ్లి.. ముస్లింలుగా తిరిగొస్తారు: పాక్ మాజీ కెప్టెన్

అయోధ్య రామ మందిరానికి హిందువులుగా వెళ్లి.. ముస్లింలుగా తిరిగొస్తారు: పాక్ మాజీ కెప్టెన్

యావత్తు దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయం నిర్మాణ పనులు దాదాపు పూర్తవగా.. ఈ ఏడాది చివరినాటికి మిగిలిన పనులు పూర్తి కానున్నాయి. ఇలాంటి సమయాన రామ మందిరాన్ని, దాని ప్రతిష్టను కించపరిచేలా పాకిస్తాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సదరు వీడియోలో మియాందాద్ అయోధ్య రామ మందిర నిర్మాణం.. ఇస్లాంకు ప్రతీక అని నొక్కి చెప్తున్నారు.

వీడియోలో ఏముందంటే.. "అయోధ్య రామమందిరాన్ని సందర్శించే హిందువులు.. ముస్లింలుగా బయటకొస్తారు. మన మూలాలతో ముడిపడి ఉన్న ప్రదేశాలను సందర్శించే వారిపై మన విశ్వాసం(ఇస్లాం మతం) తన వెలుగును ప్రకాశిస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడం ద్వారా మోడీ తప్పు చేసి ఉండవచ్చు, కానీ అది మనకు మంచిదే. ఒక ఆశీర్వాదంలా పనిచేస్తుంది. ముస్లింలు మరోసారి ఇక్కడే పుంజుకుంటారు. ఈ విషయంలో అల్లాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.." అని మియాందాద్ పేర్కొన్నారు.

శంకుస్థాపన జరిగిన మూడు రోజుల అనంతరం

2020 ఆగస్టు 5న దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యరామ మందిరం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలను స్థాపించారు. ఈ పూజజా కార్యక్రమం జరిగిన మూడు రోజుల అనంతరం 2020 ఆగస్టు 8న మియాందాద్ ఈ వీడియోను అప్ లోడ్ చేశారు.