చెత్త కుప్పను గత ప్రభుత్వాలు తమకు వారసత్వంగా ఇచ్చి వెళ్లాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్య గత ప్రభుత్వాల శాపమని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో లీచెట్ శుద్ధి ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. చెత్త నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
ఈ శుద్ధి ప్లాంట్‌ను రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్‌డీల సామర్థ్యంతో నిర్మించింది. కలుషిత వ్యర్థ జలాలను సంపూర్ణంగా శుద్ధి చేసేందుకు ఒక సమగ్రమైన పరిషారాన్ని సిద్ధం చేసిన జీహెచ్‌ఎంసీ, 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్‌నగర్ డంప్ యార్డులో వ్యర్థ జలాల ట్రీట్‌మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని రాంకీ సంస్థ చేపట్టింది.