సరిహద్దులో జవాన్ల దీపావళి వేడుకలు

దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా అంతా కలిసి దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు.  పలువురు రాజకీయనాయకులు,సెలబ్రిటీలు కూడా దీపావళి సెలబ్రేషన్లో పాల్గొన్నారు. ఇక నిరంతరం దేశ రక్షణ కోసం గస్తీ కాసే జవానులు సైతం దీపావళి వేడుకలు జరుపుకున్నారు. జమ్మూ కాశ్మీర్ లో  72 బెటాలియన్ బిఎస్ఎఫ్ (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్) జవాన్లు పూంచ్‌ సెక్టార్ లో దీపావళిని జరుపుకున్నారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటిబిపి) జవాన్లు తూర్పు లడఖ్‌లో  దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పటాసులు పేలుస్తూ డ్యాన్సులు చేశారు.