- ఉదయ్ కొటక్ కొడుకు సీఈఓ కాడు
- కొటక్ మహీంద్రా బ్యాంక్ డైరెక్టర్
ముంబై: కొటక్ మహీంద్రా బ్యాంకు సీఈఓ రేసులో ఉదయ్ కొటక్ కొడుకు జే కొటక్ లేరు. 1985 లో బ్యాంకు పెట్టినప్పటి నుంచి అందులోనే పనిచేస్తున్నా, సీఈఓ పదవి చేపట్టేందుకు జే కొటక్ ఆసక్తిగా లేరని హోల్టైమ్ డైరెక్టర్ కేవీఎస్ మణియన్ చెప్పారు. ఉదయ్ కొటక్ ప్లేసులో రాబోయే ఆరు నెలల్లో కొత్త సీఈఓను అపాయింట్ చేసుకోవాలని కొటక్ మహీంద్రా బ్యాంక్ చూస్తోంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మేరకు ఉదయ్ కొటక్ ఈ బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోంది. జే కొటక్ ఇంకా యువకుడు. చాలా నేర్చుకోవాల్సి ఉందని మణియన్ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొత్త సీఈఓ ఎవరనేది బోర్డు రాబోయే అయిదారు నెలల్లో బయటకు వెల్లడిస్తుందని పేర్కొన్నారు.