దేశవాళీ క్రికెటర్లకు ప్రైజ్ మనీ.. స్పష్టం చేసిన బీసీసీఐ సెక్రటరీ

దేశవాళీ క్రికెటర్లకు ప్రైజ్ మనీ.. స్పష్టం చేసిన బీసీసీఐ సెక్రటరీ

దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. దేశీయ స్థాయిలో మహిళలకు, పురుషులకు ప్లేయర్-ఆఫ్-ది-మ్యాచ్.. ప్లేయర్-ఆఫ్-ది-టోర్నమెంట్ అవార్డు విజేతలకు ప్రైజ్ మనీని ప్రవేశపెట్టింది. మెన్స్ క్రికెట్‌లో విజయ్ హజారే.. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌కు ప్రైజ్ మనీని అందజేస్తామని బీసీసీఐ సెక్రటరీ జే షా సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో ప్రకటించారు.

"మా డొమెస్టిక్ క్రికెట్ లో ఉమెన్స్, మెన్స్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కోసం మేము ప్రైజ్ మనీని ప్రకటిస్తున్నాం. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. ఈ మార్పు దేశవాళీ క్రికెటర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనను బయటకు తీసుకొని వస్తుంది. ఈ ప్రయత్నంలో అపెక్స్ కౌన్సిల్ ఇచ్చిన  మద్దతుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు" అని షా తెలిపారు. 

రంజీ ట్రోఫీ విజేతకు గత సంవత్సరం రూ. 5 కోట్ల భారీ నగదు ప్రైజ్ మనీని బీసీసీఐ పెంచింది. ఇదే క్రమంలో ఇరానీ కప్ ప్రైజ్ మనీ రెట్టింపు చేయబడింది. విజేతలకు రూ. 25 లక్షలకు బదులుగా రూ. 50 లక్షలు అందజేశారు. రన్నరప్‌గా నిలిచిన జట్టుకు రూ. 25 లక్షలు లభించాయి. దులీప్ ట్రోఫీలో విజేతగా నిలిచిన జట్టు రూ. కోటి రన్నరప్ జట్టు రూ 50 లక్షలు అందుకుంటారు.