Champions Trophy 2025: కోహ్లీ, రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారా..? క్లారిటీ ఇచ్చిన జైషా

Champions Trophy 2025: కోహ్లీ, రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతారా..? క్లారిటీ ఇచ్చిన జైషా

టీమిండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శనివారం (జూన్ 29) దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత వీరు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. వరల్డ్ కప్ కు ముందు గంభీర్ హెడ్ కోచ్ గా వస్తే కోహ్లీ, రోహిత్ లకు ఈ మెగా ఈవెంట్ లో చోటు దక్కదనే ప్రచారం గట్టిగా జరిగింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా కోహ్లీ, రోహిత్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. వీరిద్దరూ 2025 లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటారని కన్ఫర్మ్ చేశాడు. 

Also Read:టీమిండియాకు రూ. 125 కోట్ల నజరానా

వచ్చే ఏడాది(2025) జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లకు  సీనియర్ ఆటగాళ్లు జట్టులోనే ఉంటారని జైషా అన్నారు. టీమిండియా అన్ని టైటిళ్లు గెలవాలని.. భారత జట్టు పురోగతి సాధిస్తోందని ఆయన తెలిపారు. మా తర్వాతి లక్ష్యం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ. ఆ మెగాటోర్నీలో సీనియర్లు ఉంటారని జైషా చెప్పుకొచ్చాడు. రోహిత్, కోహ్లీ ప్రస్తావింవచకపోయినా సీనియర్లు అని చెప్పడంతో ఫ్యాన్స్ కు ఊరట లభించింది.   

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ జరగాల్సి ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కరాచీ, లాహోర్,రావల్పిండిలను వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీకి వేదికలుగా ప్రకటించింది. టీమిండియా మ్యాచ్ ల వేదిక విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. పాకిస్థాన్ లో భారత్ పర్యటించనందున హైబ్రిడ్ మోడల్ లోనే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. చివరిసారిగా 2017 లో ఛాంపియన్స్ జరిగింది. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్ పై పాకిస్థాన్ ఫైనల్లో గెలిచి టైటిల్ గెలుచుకుంది.