బ్రిడ్జ్‌టౌన్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో సీనియర్ ప్లేయర్లు కచ్చితంగా ఆడతారని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టం చేశాడు. ‘కోహ్లీ, రోహిత్, జడేజా రిటైర్మెంట్‌తో టీమిండియా సంధి దశ ముగిసిపోయింది. ప్రస్తుతం టీ20ల్లో కొత్త టీమ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. మిగతా ఫార్మాట్లలో సీనియర్లు కచ్చితంగా బరిలోకి దిగుతారు. చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ గెలవడం మా తదుపరి లక్ష్యం. దీన్ని పూర్తి చేయాలంటే సీనియర్లు ఉండాల్సిందే. ఈ రెండు టోర్నీలకు గతంలో ఆడిన జట్లే దాదాపుగా ఉంటాయి’ అని షా పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌ను సెలెక్టర్లు ఎంపిక చేస్తారన్నాడు. హార్దిక్ పాండ్యాతో పాటు ఇతర ప్లేయర్ల గురించి కూడా చర్చిస్తామని షా తెలిపాడు. ఈ టీమ్‌లో నుంచి ముగ్గురు మాత్రమే జింబాబ్వే టూర్‌కు వెళ్తున్నారని చెప్పాడు.