టీమిండియా హెడ్ కోచ్ కోసం బీసీసీఐ తనను సంప్రదించినట్లుగా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ తెలిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు వాట్సన్, జస్టిన్ లాంగర్ కోసం బీసీసీఐ సంప్రదింపులు జరిపినట్టు నివేదిలకు తెలిపాయి. అయితే బీసీసీఐ.. ఆస్ట్రేలియా క్రికెటర్లను హెడ్ కోచ్ పదవి కోసం సంప్రదించలేదని బీసీసీఐ సెక్రటరీ జైషా తేల్చి చెప్పాడు.
టీ20 ప్రపంచకప్ జూన్‌లో ముగిసిన తర్వాత టీమిండియా మెన్స్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ ఎవరు దానిపై ఆసక్తి మొదలైంది. ఈ క్రమంలో పలువురు ఆస్ట్రేలియా క్రికెటర్లను బీసీసీఐ కోచ్ పదవి కోసం ఆహ్వానించినట్లు వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అయితే టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పాత్ర కోసం బీసీసీఐ గాని.. నేను గాని మాజీ ఆసీస్ క్రికెటర్‌ను సంప్రదించినలేదని.. వస్తున్న నివేదికలు 'పూర్తిగా తప్పు' అని జయ్ షా అన్నారు.
భారత ప్రధాన కోచ్‌కు దేశవాళీ క్రికెట్ పట్ల అవగాహన ఉండటం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌దే అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్ర అని జైషా చెప్పుకొచ్చారు. ప్రధాన కోచ్ పాత్రకు ఎక్కువ అనుభవం ఉన్నవారి కావాలని బీసీసీఐ కార్యదర్శి అన్నారు. ఈ నెల ప్రారంభంలో BCCI టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పదవీ కాలం ఈ ఏడాది జూలై 1 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2027తో ముగుస్తుంది.
JAY SHAH CONFIRMS BCCI HASN'T APPROACHED ANY AUSTRALIAN PLAYER FOR BEEN INDIAN COACH...!!!!
— Johns. (@CricCrazyJohns) May 24, 2024
- The news in the media is completely incorrect. pic.twitter.com/13HzClT0st