వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగనున్న 2024 టీ20 ప్రపంచ కప్ లో భారత్ కు కెప్టెన్ అనే విషయంలో బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. నిన్న (ఫిబ్రవరి 14) అధికారికంగా రోహిత్ శర్మ భారత జట్టును కెప్టెన్ గా భారత జట్టును నడిపిస్తాడని ధృవీకరించారు.2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లీ తిరిగి టీ20 ఫార్మాట్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రోహిత్ కెప్టెన్సీలోనే ఇండియా వరల్డ్ కప్ ఆడుతుందని బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న జై షా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ ద్రవిడ్, రోహిత్ సమక్షంలోనే చెప్పారు.
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టుకు ముందు (ఫిబ్రవరి 14) నిరంజన్ షా స్టేడియంను ఆవిష్కరించిన సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి ఈ వ్యాఖ్యలు చేశారు. మేము 2023 ODI ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ మేము వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి అందరి హృదయాలను గెలుచుకున్నాము. బార్బడోస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ 2024 T20 ప్రపంచ కప్ గెలుస్తుందనే నమ్మకం నాకు ఉంది. అని అని జైషా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.
2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, విరాట్ కోహ్లీ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. ఏడాది పాటు హార్దిక్ టీ20ల్లో ఇండియాను నడిపించాడు. అయితే ప్రస్తుతం హార్దిక్ పాండ్య గాయం కారణంగా అందుబాటులో లేడు. వరల్డ్ కప్ లో పూణేలో బంగ్లాదేశ్‌తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్ లో గాయపడిన తర్వాత హార్దిక్ భారత జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం భారత్ ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. దీని తర్వాత ఐపీఎల్ ముగించుకొని టీ20 వరల్డ్ కప్ లో అడుగు పెట్టనుంది. T20 ప్రపంచ కప్ జూన్ 1 నుండి 29 వరకు జరుగుతుంది. జూన్ 5 న న్యూయార్క్‌లో ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్ ఆడుతుంది.
టీ20 వరల్డ్ కప్ 2024లో టీమిండియా షెడ్యూల్
ఇండియా vs ఐర్లాండ్ - జూన్ 5 న్యూయార్క్‌లో
భారత్ వర్సెస్ పాకిస్థాన్ - జూన్ 9న న్యూయార్క్‌లో
ఇండియా vs USA - జూన్ 12 న్యూయార్క్‌లో
ఇండియా vs కెనడా - జూన్ 15 ఫ్లోరిడాలో