బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులతో జై షా భేటీ

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులతో జై షా భేటీ

బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఐసీసీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బాధ్యతలు స్వీకరించిన జై షా.. గురువారం 2032 బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులతో భేటీ అయ్యారు. ఈ మేరకు ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేర్చడంపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. 2028 లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏంజిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మెగా గేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకొచ్చేందుకు గవర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాడీ సన్నాహాలు చేస్తోంది.

ఇందులో భాగంగానే బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులతో సమావేశం జరిగినట్లు ఐసీసీ వర్గాలు తెలిపాయి. ‘ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చే ఉద్యమం కోసం ఎదురుచూస్తున్నాం. ఈ రోజు బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సమావేశం అద్భుతంగా జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని విషయాలపై చర్చిస్తాం’ అని జై షా ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ సమావేశానికి ఆర్గనైజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిండి హుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో నిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాక్లీ హాజరయ్యారు. ఇక ఇండియా, ఆస్ట్రేలియా మధ్య శనివారం నుంచి జరిగే మూడో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జై షా వీక్షించే అవకాశాలున్నాయి.