T20 World Cup 2024: టీమిండియాతో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు చేరతాయి: జైషా

T20 World Cup 2024: టీమిండియాతో పాటు ఆ మూడు జట్లు సెమీస్‌కు చేరతాయి: జైషా

ప్రపంచ క్రికెటర్లందరూ ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నారు. మరో వారంలో ఐపీఎల్ ముగుస్తుండడంతో ప్రస్తుతం క్రికెట్ అభిమానుల దృష్టి టీ20 వరల్డ్ కప్ పైన పడింది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ జరగనుంది. జూన్ 30న బార్బడోస్ లో ఫైనల్ తో ముగుస్తుంది. క్రికెట్ దిగ్గజాలు సెమీ ఫైనల్ కి వెళ్లే జట్లేవో అంచనా వేస్తున్నారు. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ కు ఏ జట్లు వెళ్తాయో జోస్యం చెప్పాడు. 

భారత్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీ20 వరల్డ్ కప్ లో బలమైన జట్లన్నీ.. ఈ నాలుగు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్తాయని జైషా అన్నారు. ఈ లిస్టులో ఆశ్చర్యకరంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకు చోటు కల్పించకపోవడం విశేషం. ఇప్పటికే దాదాపుగా అన్ని జట్లు 15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించేశారు. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించింది. 

ఎన్నడూలేని రీతిలో ఈసారి 20 జట్ల మధ్య పోటీ జరగనుండగా.. మొత్తం 10 వేదికల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఇందులో ఐదు వేదికలు అమెరికాలో ఉండగా.. మరో ఐదు వేదికలు కరేబియన్‌ దీవుల్లో ఉండనున్నాయి. అమెరికాలోని 5  వేదికలుగా ఫ్లోరిడాతో పాటు మోరిస్‌విల్లే, డల్లాస్, న్యూయార్క్, లాడారు హిల్ ఉన్నాయి. 

మొత్తం 55 మ్యాచ్ లతో ఈ సారి గ్రాండ్ గా ఈ టోర్నీ జరగనుంది. అమెరికాలో 16 మ్యాచ్ లు జరగనుండగా.. సూపర్-8 మ్యాచ్ లతో సహా ప్రధాన మ్యాచ్ లు వెస్టిండీస్ వేదికగా జరుగుతాయి. 2013 నుంచి ఐసీసీ టోర్నీలో ఒకే గ్రూప్ లో ఉంటూ వస్తున్న భారత్, పాకిస్థాన్ జట్లు ఈ సారి కూడా ఒకే గ్రూప్ లో ఉండబోతున్నాయి.