వరుసగా మూడో సారి..ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా జైషా

వరుసగా మూడో సారి..ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా జైషా

బీసీసీఐ సెక్రటరీ జైషా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 35 ఏళ్ల ఆయన వరుసగా మూడోసారి ఏసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. జైషా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పదవికి పోటీ చేయనున్నాడని.. ఈ నేపథ్యంలో తన పదవులను వదులుకుంటున్నాడని క్రిక్ బజ్ నివేదిక తెలిపింది. అయితే తాజాగా షా ACC చైర్మన్ గా ఎంపికవ్వడంతో ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది.         

శ్రీలంక క్రికెట్ (SLC) ప్రెసిడెంట్ షమ్మీ సిల్వా ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా జైషా పేరును ప్రతిపాదించగా..ACC సభ్యులందరి నుండి ఏకగ్రీవ మద్దతు లభించింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కి చెందిన నజ్ముల్ హసన్ తర్వాత  2021 జనవరిలో  జైషా ACC ప్రెసిడెంట్ గా నియమించబడ్డారు. షా హయాంలో ఆసియా క్రికెట్ అంతటా చెప్పుకోదగ్గ పురోగతి సాధించింది. ఆసియా కప్ ను 2022లో టీ20 ఫార్మాట్ గా, 2023లో వన్డే ఫార్మాట్ లో విజయవంతంగా నిర్వహించింది. ప్రీమియర్ క్రికెట్ ఈవెంట్‌లను సైతం నిర్వహించింది. 

జైషా భారత హోమ్ వ్యవహారాల మంత్రి అమిత్ షా కుమారుడు. 2019 లో బీసీసీఐ కార్యదర్శి అయ్యాడు. 2021 నుంచి ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగుతున్నారు.