భారత మాజీ క్రికెటర్ అన్షుమాన్ గైక్వాడ్ క్యాన్సర్ తో పోరాడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన అతను లండన్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ మాజీ క్రికెటర్ చికిత్స కోసం బీసీసీఐ గొప్ప మనసును చాటుకుంది. అతని చికిత్స కోసం వెంటనే కోటి రూపాయలను విడుదల చేయాలని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా ఆదివారం (జూలై 14) సంబంధిత అధికారులను ఆదేశించారు.
అన్షుమాన్ గైక్వాడ్ చికిత్స కోసం 1983 ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యులు క్యాన్సర్ చికిత్స నిధులు కోసం పాలు పంచుకున్నారు. కపిల్ దేవ్, సందీప్ పాటిల్, సునీల్ గవాస్కర్, మొహిందర్ అమర్‌నాథ్, రవిశాస్త్రి తదితర భారత మాజీ క్రికెటర్లు గైక్వాడ్ వైద్య ఖర్చుల కోసం నిధులు కేటాయించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోజై షా.. గైక్వాడ్ కుటుంబసభ్యులతో మాట్లాడి వారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని వారికి సహాయాన్ని అందించారు. బీసీసీఐ ఖజానా నుంచి కోటి రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించి వారి కుటుంబానికి అండగా నిలిచారు. షా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మాజీలు హర్షం వ్యక్తం చేశారు.
ALSO READ | ధోనికి చోటులేదు.. యువీ ఆల్ టైమ్ XIలో నలుగురు ఆస్ట్రేలియన్లు
గైక్వాడ్ ప్రస్తుత వయసు 71 సంవత్సరాలు. భారత్ తరపున 1974 నుంచి 1987 వరకు క్రికెట్ ఆడారు. 40 టెస్టుల్లో 29 యావరేజ్ తో 1985 పరుగులు చేశారు. అతని ఖాతాలో రెండు సెంచరీలు 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 15 వన్డేల్లో 20 యావరేజ్ తో 269 పరుగులు చేశారు. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 201 కాగా.. వన్డేల్లో 78.
Jay Shah has instructed BCCI to release 1 Crore to former Indian player Anshuman Gaekwad who is battling with cancer. [ANI]
— Johns. (@CricCrazyJohns) July 14, 2024
- Great gesture by BCCI & Jay Shah. pic.twitter.com/eQGjbOdfqd