జై షాకు స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఎందుకంటారా?

జై షాకు స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.. ఎందుకంటారా?

బీసీసీఐ కార్యదర్శి, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) అధ్యక్షుడు జై షాను సిఐఐ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ 2023 అవార్డు వరించింది. పురుష, మహిళా క్రికెటర్ల మధ్య వేతన వ్యత్యాసాన్ని తొలగించడమే కాకుండా, దేశంలో క్రికెట్ అభివృద్ధికి అతను అందించిన సేవలకుగానూ ఈ అవార్డు వరించినట్లు బీసీసీఐ ట్వీట్ చేసింది.

జై నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిందని తెలిపిన బీసీసీఐ.. ఐసీసీ పురుషుల ప్రపంచ కప్‌ను అందరూ మెచ్చుకునేలా నిర్వహించడం, పురుష-మహిళా క్రికెటర్లకు సమాన వేతనం, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని సృష్టించడం, ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంలో అతని పాత్ర వంటి కార్యక్రమాలు అతనికి ఈ అవార్డు రావడంలో దోహదపడ్డాయని  బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది.

ALSO READ :- బౌలింగ్ స్పీడ్ పెంచు: బుమ్రాకు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ సలహా

పురుష-మహిళా క్రికెటర్లకు సమాన వేతనం

నిజానికి గతేడాది ముందు వరకు పురుష క్రికెటర్లతో పోలిస్తే మహిళా క్రికెటర్లకు వేతనాలు చాలా తక్కువ. అందునా వారి మ్యాచ్ లను కూడా సరిగ్గా నిర్వహించేవారు కాదు. కానీ, ప్రస్తుతం అలా లేదు. గతేడాది చివరలో బీసీసీఐ పే ఈక్విటీ పాలసీ (Pay Equity Policy) పద్ధతిని తీసుకొచ్చింది. అప్పటినుంచి భారత మహిళా క్రికెటర్లు పురుష క్రికెటర్లతో సమానంగా మ్యాచ్​ ఫీజు పొందనున్నారు. అలాగే, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌ని సృష్టించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. జై షా తీసుకున్న ఈ రెండు నిర్ణయాలే అతనికి సిఐఐ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్ 2023 అవార్డును సాధించి పెట్టాయనే టాక్ వినపడుతోంది.