యూపీలో జరుగుతోన్న మహాకుంభమేళాపై సమాజ్ వాద్ పార్టీ ఎంపీ జయాబచ్చన్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో నదుల్లోని నీరు కలుషితమైందని వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలోకి విసిరేసినందున నీరు కలుషితమైందని ఆరోపించారు. కుంభమేళాలో స్నానానికి వచ్చిన వీఐపీ లకు ప్రత్యేక వసతులు కల్పించడం వల్ల బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.
మహాకుంభమేళాకు వచ్చిన సామాన్య ప్రజలకు యూపీ సర్కార్ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ప్రత్యేక వసతులు కల్పించలేదు. వీఐపీలకు మాత్రం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేసింది. అత్యధికంగా నీళ్లు ఎక్కడ కలుషితమవుతున్నాయంటే అది ప్రయాగ్ రాజ్ లోనే.మృతదేహాలను నదిలో పడేశారు. దీని వల్ల నదుల్లోని నీరు కలుషితమైంది. తొక్కిసలాటలో 30 మంది చనిపోయినా యూపీ సర్కార్ కంటి తూడుపు చర్యలు చేపట్టింది. మహాకుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్యను ప్రభుత్వం వెల్లడించారు. కుంభమేళాలో ఏర్పాట్లపై ఎవరూ మాట్లాడటం లేదు. అని జయాబచ్చన్ వ్యాఖ్యానించారు.
ALSO READ | నా దగ్గర రూపాయి లేదు.. అందుకే సన్యాసం తీసుకున్నా..: మాజీ హీరోయిన్ కన్నీటి కథ
జయాబచ్చన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుచేటని..కోట్లాది మంది భక్తులు వచ్చే కుంభమేళాను అవమానిస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. జయాబచ్చన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మహా కుంభమేళా యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళ ఫిబ్రవరి 26న ముగుస్తుంది. జనవరి 29న జరిగిన తొక్కిసలాటలో 30 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం జ్యూడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది.