
గరిడేపల్లి, వెలుగు : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సూర్యాపేట పట్టణంలోని జయ జూనియర్ కళాశాల రెండో బ్యాచ్ కు చెందిన 13 మంది విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారని కళాశాల కరస్పాండెంట్ జయవేణుగోపాల్ తెలిపారు.
కె.ఉజ్వన్ 99.03, సీహెచ్ హన్షిత 98.73, బి.శివమణి 98.68, డి.జగదీశ్ రాజు 97.76, జి.తేజశ్రీ 97.74, టి.అమూల్య 96.97, పి.అమిత్ సూర్య 96.88, బి.లాస్య 96.27, కె.సాయినందన్ 94.42, ఎం.సాద్విక 93.29, సీహెచ్ కుశల్ రాజ్ 93.23, జి.సాయిరామ్ 92.69, ఎస్.నక్షత్ర 90.62 పర్సెంటేజ్ తో రాణించారని వివరించారు. ఈ సందర్భంగా ప్రతిభను కనబర్చిన విద్యార్థులను, వారిని ప్రోత్సహించిన అధ్యాపక బృందానికి కరస్పాండెంట్ జయవేణుగోపాల్, డైరెక్టర్లు జెల్లా పద్మ, బింగి జ్యోతి అభినందనలు తెలిపారు.