‘నువ్వు చెప్పేదేంటి.. చేస్తుందేంటి..?’ జయ కిషోరిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

‘నువ్వు చెప్పేదేంటి.. చేస్తుందేంటి..?’ జయ కిషోరిపై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

ఆధ్యాత్మిక బోధనలతో, భజన పాటలతో ఫేమస్ అయిన ఆధ్యాత్మిక బోధకురాలు జయ కిషోరిపై నెట్టింట విమర్శల వర్షం కురుస్తోంది. 29 ఏళ్ల వయసులోనే హిత బోధలతో ‘మానవ జన్మంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. డబ్బుపై వ్యామోహం ఉండరాదు.. ఎముకల గూడుకు ఎందుకీ ఆడంబరాలు.. భోగభాగ్యాలను త్యజించి జీవించాలి’ అని నీతులు చెప్పే ఈ బోధకురాలు ‘చెప్పేటందుకే నీతులు’ అని మరోసారి నిరూపించింది. వేటిపైన వ్యామోహం ఉండకూడదని ఒకపక్క చెబుతూనే.. సనాతన ధర్మాన్ని కాపాడాలని బోధనలు దంచికొడుతూనే.. మరోపక్క లగ్జరీ లైఫ్ను జయ కిషోరీ ఎంజాయ్ చేస్తుండటం కొసమెరుపు. ఈ విషయం తాజాగా ఆమె ధరించిన హ్యాండ్ బ్యాగ్ వల్ల బయటపడింది.🙃 pic.twitter.com/gdl3OGq4O9

ఎయిర్పోర్ట్లో ఆమె తారసపడటంతో కొందరు వీడియోలు తీశారు. ఆమె లగేజ్లో ఉన్న హ్యాండ్ బ్యాగ్ చూసి నెటిజన్లు నివ్వెరపోయారు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ.2 లక్షల పైమాటే. డియోర్ బుక్ నోట్(Dior Book Tote) అనే బ్యాగ్ ఆమె లగేజ్లో కనిపించింది. పైగా.. ఆమె పేరు ఆ బ్యాగ్పై ఉండేలా ‘Jaya’ అనే పేరుతో కస్టమైజ్ చేయించుకుంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. జయకిషోరిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

జనంలోకి వచ్చి బోధనలు ఇచ్చేటప్పుడేమో సింపుల్గా కనిపిస్తూ.. భోగాలపై తనకు మోజు లేదని బోధనలిస్తూ, అందరూ అలానే ఉండాలని ఈవిడా నీతులు చెప్పేదని విమర్శిస్తున్నారు. ఇదిలా ఉండగా.. జయ కిశోరికి ఇన్స్టాగ్రాంలో ఉన్న పాపులారిటీ అంతాఇంతా కాదు. ఈ స్పిరిచ్యువల్, మోటివేషన్ స్పీకర్కు 12.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, దేశంలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ అంబానీ కుటుంబంతో కలిసి ఉన్న ఫొటోలు ఆమె ఇన్స్టాలో ఉన్నాయి.