న్యూఢిల్లీ: రైల్వే బోర్డు సీఈవో, చైర్‌పర్సన్‌గా జయా వర్మ సిన్హా నియమితులయ్యారు. 105 ఏండ్ల రైల్వే శాఖ చరిత్రలో ఈ బాధ్యత లు చేపట్టనున్న తొలి మహిళ జయా వర్మ సిన్హానే కావడం విశేషం. సెప్టెంబర్ 1 నుంచి 2024 ఆగస్టు 31వరకు లేదా తదుపరి ఆదేశా లు వచ్చే వరకు ఆమె పదవిలో కొనసాగుతా రు. అలహాబాద్ వర్సిటీలో చదివిన జయా వర్మ సిన్హా..1988లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్టీసీ)లో చేరారు. ఉత్తర, సౌత్ ఈస్టర్న్, తూర్పు రైల్వే జోన్‌లలో పనిచేశారు.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని భారత హైకమిషన్‌లో రైల్వే సలహాదారుగా నాలుగేండ్లు డ్యూటీ చేశారు. కోల్‌కతా, ఢాకాలను కలిపే రైలు సర్వీస్ మైత్రీ ఎక్స్‌ప్రెస్ ఏర్పాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. జూన్‌లో ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని వివరించడం ద్వారా జయా వర్మ సిన్హా మీడియాలో కనిపించారు. నిజానికి ఆమె అక్టోబర్ 1న పదవీ విరమణ చేయాల్సి ఉంది.