జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత.. ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎంజీఆర్ తర్వాత అన్నాడీఎంకే పార్టీకి అధ్యక్షురాలై.. తమళనాడు ముఖ్యమంత్రిగా, తిరుగులేని నాయకురాలిగా చక్రం తిప్పిన జయలలిత అక్రమాస్తుల కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. బతికినన్ని నాళ్లు విలాసవంతమైన జీవితం గడిపిన జయలలిత అక్రమ ఆస్తులు, అవినీతి, వారసత్వం.. తదితర కేసుల విచారణ పూర్తవడంతో ఆ ఆస్తులను కర్ణాటక ప్రభుత్వానికి అప్పగించింది బెంగళూరు కోర్టు. 

 జయలలితకు చెందిన మొత్తం 468 రకాల బంగారు ఆభరణాలు, 700 కిలోల వెండి, 10,344 పట్టు చీరలు,12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీల సెట్లు, 8 VCRలు, 1 వీడియో కెమెరా, 4 CD ప్లేయర్లు, 3 ఇనుప లాకర్లు మొదలైన ఆస్తులన్నీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు. 

సీబీఐ కోర్టు జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న 27 కిలోల నగలు, 1562 ఎకరాల భూమిని ఫిబ్రవరి 14- 15 తేదీలలో తమిళనాడు అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని ఆదేశించింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) తమిళనాడు నుంచి వచ్చిన అధికారులకు జయలలితకు చెందిన ఆభరణాలు, వస్తువులు.. ఆస్తుల పత్రాలను అప్పగించారు. తమిళనాడు హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజిపి విజిలెన్స్ ఆధ్వర్యంలో ఆస్తులు అప్పగించారు. 

జయలలితపై ఉన్న కేసు ఏంటి:

తమిళనాడు మాజీ సీఎం ఎంజీఆర్ అండదండలతో దివంగత జయలలిత  ఏఐడీఎంకేలో కీలక నేతగా ఎదిగారు. 1991లో తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఆ తర్వాత1996లో డీఎంకే అధికారంలోకి వచ్చింది.  ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ డీఎంకే హయాంలో కేసు నమోదైంది.1995లో ఆమె దత్త పుత్రుడు సుధాకరన్ పెళ్లివేడుకలను భారీ ఖర్చులతో చేయడంతో డీఎంకే అధికారంలోకి రాగానే ఆమెపై అవినితీ కేసు నమోదైంది.  జయలలితతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సుధాకరన్, ఇళవరసి నలుగురిపై కూడా నమోదైంది. 

కేసు విచారణ తమిళనాడులో ఉంటే ప్రభావితం అవుతుందన్న పిటిషన్ తో కర్ణాటక కోర్టుకు బదిలీ చేసి.. అక్కడే సుదీర్ఘ విచారణ జరిపారు.ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు దర్యాప్తు చేశారు. విచారణ పూర్తయ్యాక 2014లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిందితులుగా చేరుస్తూ.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది సీబీఐ కోర్టు. నిందితులు సీబీఐ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేయడంతో శిక్షను రద్దు చేసింది. కానీ ఈ ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది.

జయలలిత సహా నలుగురికి బెంగళూరు ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు రాకముందే, జయలలిత అనారోగ్యంతో డిసెంబర్ 5, 2016న మరణించారు. దీని తరువాత, ముగ్గురూ – శశికళ, ఇళవరసి. సుధాకరన్ బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. వారి మొత్తం శిక్ష పూర్తయిన తర్వాత వారిని విడుదల చేశారు.

అయితే జయలలిత ఆస్తులకు తామే వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె. దీపక్, జె దీప అనే వ్యక్తులు కర్ణాటక హైకోర్టు పిటిషన్ వేయగా కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. కర్ణాటక తీర్పును సమర్థిస్తూ వారసులమని అప్పీలు చేసిన పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులపై విచారణ ఎట్టకేలకు పూర్తవ్వడంతో.. వేల కోట్ల ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.