క్రైం థ్రిల్లర్ తో గాడ్ మూవీ..పిల్లలు భయపడే అవకాశం ఉంది: హీరో జయం రవి

 క్రైం థ్రిల్లర్ తో గాడ్ మూవీ..పిల్లలు భయపడే అవకాశం ఉంది: హీరో జయం రవి

తమిళ మూవీ తని ఒరువన్(Thani Oruvan) తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు జయం రవి(JayamRavi). అదే మూవీని తెలుగులోధ్రువగా రీమేక్ చేసి రామ్ చరణ్ హిట్ కొట్టారు. ఇక జయం రవి తమిళ నటుడే అయినా డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక లేటెస్ట్గా జయం రవి నుంచి ఇరైవన్( Iraivan) మూవీ రాబోతుంది. లేడీ సూపర్ స్టార్‌ నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ మూవీని తెలుగులో గాడ్(GOD)అనే టైటిల్ తో థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన తని ఒరువన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

గాడ్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసుకుంది. నయనతార..జయం రవి సినిమాలకి సాధారణంగా సెన్సార్ నుంచి  క్లీన్ యూ సర్టిఫికెట్‌ వస్తోంది. కానీ గాడ్ మూవీకి ఏ సర్టిఫికెట్‌ రావడంతో యూనిట్ సభ్యులతో పాటు..ఫ్యాన్స్ కు కూడా షాకింగ్గా ఉంది. ఈ మూవీలో హింసకు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో..సెన్సార్(Censorboard)  వాళ్ళు ఏ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. 

లేటెస్ట్ గా ఈ మూవీకి A సర్టిఫికెట్ రావడంతో హీరో జయం రవి స్పందిస్తూ..నేను ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమా అన్నివయసుల ప్రేక్షకులకు వినోదాన్ని పంచే విధంగా చేసినవే. కానీ, గాడ్ మూవీని పిల్లలతో కలిసి చూడకండి. ఎందుకంటే..ఈ సినిమాలో ఉన్న హింసాత్మక సీన్స్ కు పిల్లలు భయపడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ మూవీ మాస్ ఆడియన్స్కి, క్రైం థ్రిల్లర్ జోనర్ని ఇష్టపడే వారికి మాత్రం పండుగనే చెప్పుకోవాలి. అంటూ పేర్కోన్నారు.

ఈ మూవీ ట్రైలర్ విషయానికి వస్తే..

సైకో-క్రైమ్ థ్రిల్లర్‌ తో వస్తోన్న ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్ క్యారెక్టర్లో జయం రవి ఇంటెన్సివ్ లుక్ తో ఆకట్టుకుంటున్నారు. కమర్షియల్ యాంగిల్తో పాటు సమాజంలో జరిగే రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని మూవీ వస్తోంది.ట్రైలర్లో..అమ్మాయిలని టార్గెట్ చేసి, మర్డర్ చేసే సైకో కిల్లర్ మైండ్ సెట్ని డైరెక్టర్ క్లియర్గా చూపించారు. వరసగా అమ్మాయిలని కిరాతకంగా చంపి..వారి బాడీ పార్ట్స్ని వేరు చేసి, ఆనందం పొందే సైకోని పట్టుకోవడానికి జయం రవి స్పెషల్ ఆఫీసర్గా..సీరియస్ ఇంటెన్స్ పాత్రలో యాక్ట్ చేస్తున్నారు.

ఇక స్టోరీ థీమ్ని.. ట్రైలర్లో చూపించిన డైరెక్టర్ ఆలోచన గ్రేట్ అని చెప్పుకోవాలి. ఈ మధ్య వచ్చిన మూవీస్లో ట్రైలర్తో అట్ట్రాక్ట్ చేసి సినిమాలతో బోర్ కొట్టిస్తున్న డైరెక్టర్స్ చాలానే ఉన్నారు.ఆ డైరెక్టర్స్ లిస్టులో ఐ అహ్మద్ లేకపోవడం విశేషం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇరైవన్ డైరెక్టర్ ట్రైలర్ లోనే సిన్సియర్గా స్టోరీపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది

ఐ అహ్మద్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తుండగా..సైకో కిల్లర్ అమ్మాయిలని చంపే టైంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ గా ఉంది. ఫ్యాషన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.