JayamRavi: జయం రవితో ప్రియాంక మోహన్కు నిజంగానే పెళ్లయిందా.. క్లారిటీ వచ్చేసింది

JayamRavi: జయం రవితో ప్రియాంక మోహన్కు నిజంగానే పెళ్లయిందా.. క్లారిటీ వచ్చేసింది

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi) తన భార్య ఆర్తి (Arthi) నుండి సెప్టెంబర్ 9న సడెన్గా విడాకులు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత భార్యకు విడాకులు ఇవ్వడంతో పాటు.. తనకు తెలియకుండానే జయం రవి విడాకులు ప్రకటించినట్లు ఆర్తి ఆరోపిస్తూ నోట్ రిలీజ్ చేయడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. 

ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన గాయని కెనిషా ఫ్రాన్సిస్‌ (Kenishaa Francis)తో జ‌యం ర‌వి డేటింగ్ చేస్తున్నారంటూ జోరుగా ప్ర‌చారం సాగుతూ వచ్చింది.   దీనిపై ఇప్ప‌టికే జ‌యం ర‌వి స్పందించాడు. అవ‌న్నీపుకార్లు మాత్ర‌మేన‌ని, గాయ‌నిని ఇందులోకి లాగొద్ద‌ని కోరాడు. తాను అన్ని ఆధారాల‌తో కోర్టులో ప‌రిష్కారం కోరుతున్నాన‌ని అన్నారు. 

ALSO READ | సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కలి.. 

అలాగే సింగర్ కెనిషా ఫ్రాన్సిస్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందిస్తూ.. '. ఈ పుకార్లకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది మీ ఇంటి సమస్య కాదు.. మరొకరిది. మీరు ఈ విషయంలో ఒక అభిప్రాయానికి అర్హులు కాదు.. నేను చేయాల్సిన‌ పనులు చాలా ఉన్నాయి. ప్రస్తుతం నేను మీడియాతో మాట్లాడదలుచుకోలేదు అని వెల్లడించింది. 

ఇక ఈ డ్రామా నడుస్తున్న తరుణంలోనే జయం రవి నటి ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan)ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. పెళ్లి దుస్తులతో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నాయి.

అయితే, వీరిద్దరూ కలిసి ఉన్నఈ ఫోటోస్.. నిజ జీవితంలో నిశ్చితార్థం చేసుకోలేదని.. వారు తమ నుంచి రాబోయే నెక్స్ట్ మూవీ 'బ్రదర్'లో వచ్చే పెళ్లి సీన్ అని కోలీవుడ్ సినీ వర్గాలు తెలిపాయి.

ఇక ఈ ఫోటోతో జయం రవి రహస్య వివాహం గురించి కొంతమంది పుకార్లు వ్యాప్తి చేయడంతో.. సినీ వర్గాలు వీటికి ఫుల్ స్టాప్ పెట్టాయి. కాగా ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన బ్రదర్ సినిమాలోని పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రదర్ సినిమా విషయానికి వస్తే..

నేనే అంబానీ (Nene Ambani), ఆల్ ఇన్ ఆల్ అజగు రాజా, ఓకే, ఓకే (OK OK) చిత్రాల ఫేమ్ ఎం రాజేష్ (M Rajesh) ద‌ర్శ‌క‌త్వంలో జయం రవి బ్ర‌ద‌ర్ (Brother) మూవీలో నటిస్తున్నాడు. ఇందులో జయం రవికి జోడీగా ప్రియాంక మోహన్ న‌టిస్తుంది. భూమిక, నటరాజ్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని దీపావళి కానుకగా రిలీజ్కు సిద్ధమైంది.