బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. ఎందరి మనసులనో గెలుచుకున్న సుమ గురించి పరిచయం అక్కర్లేదు. గళ గళా మాట్లాడుతూ.. తన మాటలతో అందరినీ కట్టిపడేస్తుంది. బుల్లితెరపై నటిస్తూనే.. తాజాగా వెండితెరపై మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతోంది. సుమ కీలక పాత్రధారిగా ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగా ప్రకాశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి విజయ్ కుమార్ కలివరపు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి ఎం.ఎం. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సుమ.. అప్పులిచ్చే వ్యక్తిగా నటిస్తున్నారు. ఎంత మొండివారైనా, బాకీ తీర్చకుండా తప్పించుకునే వారైనా సరే.. ముక్కు పిండి వసూలు చేసే క్యారక్టర్లో చాలా చక్కగా నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ టైటిల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. గతంలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అదే తరహాలో టైటిల్ సాంగ్ కు కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటలో సుమ చేసే యాక్టింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో సుమ తన గాత్రాన్ని కూడా వినిపించడం గమనార్హం. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా వెండితెర, బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుందేమో చూడాలి.
Title Song #JayammaJayamma from #JayammaPanchayathi is here?
— Suma Kanakala (@ItsSumaKanakala) January 16, 2022
Unveiled by the 'Pride of India' @ssrajamouli
▶️ https://t.co/f1od3ucBRC
?@mmkeeravaani
?@srikrisin
?@ramjowrites@VijayKalivarapu @Anushkumar04 @PrakashBalaga @vennelacreation @AdityaMusic pic.twitter.com/X50ROOijjC
For More News..