వరంగల్ లో ‘జయమ్మ’ టీం సందడి

వరంగల్: నగరంలోని భద్రకాళీ అమ్మవారిని ‘జయమ్మ పంచాయతీ’మూవీ టీం సభ్యలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జయమ్మ పంచాయితీ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ప్రముఖ యాంకర్ సుమతో పాటు, హీరో హీరోయిన్లు దినేశ్ కుమార్, షాలిని కొండెపూడికి ఆలయ పూజారులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు. యాంకర్ సుమ వచ్చిందన్న విషయం తెలియడంతో పెద్ద ఎత్తున భద్రకాళీ గుడికి వచ్చిన అభిమానులు... జయమ్మ పంచాయితీ టీంతో సెల్ఫీలు దిగారు.

సినిమా ప్రమోషన్లో భాగంగా రాష్ట్రంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో జయమ్మ పంచాయితీ టీం తిరుగుతోంది. విజయ్ కుమార్ కలివరపు డైరెక్టు చేస్తున్న ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ బ్యాక్డ్రాప్ లో నడవనుంది. బలగాల ప్రకాశ్ ప్రొడ్యూసర్ గా ఉన్న ఈ సినిమాకు బాహుబలికి మ్యూజిక్ అందించిన ఎమ్ఎమ్ కీరవాణి బాణీలు సమకూరుస్తున్నాడు. మే 6న జయమ్మ పంచాయితీ థియేటర్లలో సందడి చేయనుంది.

మరిన్ని వార్తల కోసం...

బాలకృష్ణకు సర్జరీ ప్రచారంలో వాస్తవం లేదు

మామునూరు ఎయిర్ పోర్ట్కు భూములివ్వడం లేదు