కరీంనగర్ లో జయపాల్‌‌‌‌రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్​

కరీంనగర్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ లీడర్, మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్‌‌‌‌రెడ్డి బర్త్​డే వేడుకలు ఆదివారం జయపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మైత్రి ఛానల్ ఎండీ సృజన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో  కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ  చేశారు.

 గవర్నమెంట్ హాస్పిటల్, హౌజింగ్ బోర్డు క్యాన్సర్  హాస్పిటల్‌‌‌‌లో పేషెంట్లకు పండ్లు, బ్రెడ్స్‌‌‌‌తోపాటు అన్నదానం చేశారు. కాంగ్రెస్ లీడర్ వెన్నం రజిత ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లక్ష్మారెడ్డి,  సత్యనారాయణ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, నాగరాజు, కాంగ్రెస్  లీడర్లు పాల్గొన్నారు.