డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడండి : ఉమా శంకర్ ప్రసాద్

మొగుళ్లపల్లి, వెలుగు: ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ సమస్య రాకుండా చూడాలని జయశంకర్ భూపాలపల్లి ట్రైనీ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మండల స్థాయి సంబంధిత శాఖ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం మొగుళ్లపల్లి మండలంలోని రంగాపురం, మొట్లపల్లి, మెట్టుపల్లి గ్రామాల్లో పర్యటించిన ట్రైనీ కలెక్టర్ వాటర్ సమస్య సప్లై పై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఇన్​చార్జి ఎంపీడీవో, ఎంపీవో వీరస్వామి, ఆయా గ్రామాల సెక్రెటర్లు ఉన్నారు.