నీతి అయోగ్ లక్ష్యాలను వందశాతం సాధించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

నీతి అయోగ్ లక్ష్యాలను వందశాతం సాధించాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

మహాముత్తారం, వెలుగు : మండలానికి నీతి అయోగ్ కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని జయశంకర్​భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. మహాముత్తారం మండలాన్ని నీతి అయోగ్ ఆస్పిరేషనల్​ బ్లాక్​గా ప్రకటించిన నేపథ్యంలో శుక్రవారం మండలంలో సంపూర్ణతా అభియాన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జులై 4 నుంచి సెప్టెంబర్ 30వరకు మూడు నెలల పాటు జరుగనున్న ఈ ప్రక్రియతో నీతి అయోగ్ కేటాయించిన అన్ని అంశాలను కవర్ చేయాలన్నారు.

అదేవిధంగా సంక్షేమ శాఖల వసతి గృహాల్లోని ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. మహాముత్తారం మండలం కేజీబీవీ పాఠశాలలో జరిగిన వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అంతకుముందు కేజీబీవీ పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతు పనులను ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ నేలపై కూర్చుని సహాపంక్తి భోజనం చేశారు. కార్యక్రమాల్లో అడిషనల్​కలెక్టర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.