గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో బుధవారం పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పలువురు గుడుంబా తయారు చేస్తున్న 9  ప్రాంతాలను గుర్తించి, దాడులు నిర్వహించారు.

సుమారు 6,600 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి, సుమారు 2,20 లీటర్ల గుడుంబాను స్వాధీనపర్చుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. కొంతమంది గుడుంబా తయారీదారులను గుర్తించవలసి ఉందని, వారిపై సైతం కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.