IAS స్మితా సబర్వాల్‎కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ వర్శిటీ అధికారులు..!

IAS స్మితా సబర్వాల్‎కు నోటీసులిచ్చేందుకు సిద్ధమైన జయశంకర్ వర్శిటీ అధికారులు..!

హైదరాబాద్: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్‎కు నోటీసులు ఇచ్చేందుకు జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వెహికల్ అలవెన్స్ విషయంలో నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం. న్యాయ నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకునేందుకు అధికారులలు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. కాగా, సీఎంవో అడిషనల్ సెక్రటరీ హోదాలో స్మితా సబర్వాల్ 2016 నుంచి 2024 వరకు మొత్తం 90 నెలల కాలానికి రూ.61 లక్షలు జయశంకర్ వర్శిటీ నుంచి వాహన అద్దె కింద తీసుకున్నారు. 

వర్శిటీ అడిటింగ్లో ఈ విషయం బయటపడింది. స్మితా సబర్వాల్ నెలకు రూ.63000 తీసుకున్నట్లు అడిట్ అధికారులు గుర్తించారు. వర్శిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద రూ.61 లక్షలు తీసుకోవడంపై ఆడిట్ అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై యూనివర్సిటీ బోర్డు మీటింగ్‎లో చర్చించిన అధికారులు.. వర్సిటీ నుంచి వెహికల్ అలవెన్స్ కింద స్మితా సబర్వాల్ తీసుకున్న డబ్బులు తిరిగి రాబట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

ALSO READ | ఆరు గ్యారెంటీలకు నిధులు ఘనం.. పల్లెకు పట్టాభిషేకం

 దీనిపై ప్రభుత్వానికి రెండు మూడు రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించి.. ఆ తర్వాత  స్మిత సబర్వాల్‎ నుంచి నిధులు తిరిగి రాబట్టేందుకు నోటీసులు ఇవ్వాలని వర్శిటీ అధికారులు యోచిస్తోన్నట్లు సమాచారం. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన స్మితా సబర్వాల్ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు విషయంలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగానే.. స్మితా సబర్వాల్ మెడకు వర్శిటీ వ్యవహారం చిక్కుకునేలా కనిపిస్తోంది.