
కొలంబో: శ్రీలంక జట్టుకు ఆ దేశ మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య తాత్కాలిక హెడ్ కోచ్‌గా అపాయింట్ అయ్యాడు. టీమిండియాతో లిమిటెడ్ ఓవర్ల సిరీస్‌ల కోసం ఇండియాలో పర్యటించే లంక జట్టుకు అతను కోచ్‌గా పని చేయనున్నాడు. ఈ నెల 27 నుంచి జరిగే ఈ టూర్‌లో లంక మూడు టీ20లు, మూడు వన్డేల్లో ఇండియాతో తలపడనుంది.
కాగా, జయసూర్య గతంలో లంక చీఫ్ సెలెక్టర్‌గా పని చేశాడు. ఆగస్టు-–సెప్టెంబర్‌లో మూడు టెస్టుల సిరీస్ కోసం లంక జట్టు ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే వరకు జయసూర్య హెడ్ కోచ్ పదవిలో కొనసాగుతాడని ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది.