లండన్ : ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ఇండియా బౌలర్లు అదరగొట్టారు. కౌంటీ చాంపియన్‌షిప్‌లో ససెక్స్ తరఫున డెబ్యూ చేసిన పేసర్ జైదేవ్ ఉనాద్కట్.. లీసెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 9 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ 3, రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు తీసిన అతను మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు ససెక్స్ డివిజన్ వన్‌కు ప్రమోట్ అయ్యే అవకాశాలను సజీవంగా ఉంచాడు.
ఇక మిడిలెసెక్స్‌కు ఆడుతున్న సీమర్ జయంత్ యాదవ్ (5/131) కూడా డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిశాడు. దీంతో లాంక్షైర్తో జరిగిన మ్యాచ్‌ను మిడిలెసెక్స్ డ్రా చేసుకుంది. ఫలితంగా డివిజన్ వన్ స్టాటస్‌ను నిలుపుకుంది. ససెక్స్ కెప్టెన్‌గా ఉన్న చతేశ్వర్ పుజారా 26, 23 రన్సే చేసినా లీసెస్టర్‌షైర్ ఓపెనర్ రిషి పటేల్ క్యాచ్‌ను అందుకుని మ్యాచ్ విజయానికి తోడ్పడ్డాడు.