నిజాయితీ నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటు

నిజాయితీ నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటు

ఈడీ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తనలాంటి వారికి నిజాయితీని నిరూపించుకోవడానికి ఈడీ సరైన చోటన్నారు. లారీల కొనుగోలు అంశంపై తనను ప్రశ్నించారని చెప్పారు. లారీలు కొనుగోలు చేసిన వ్యక్తిపై ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తాను మనీలాండరింగ్కు పాల్పడలేదని చెప్పారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఈడీ విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు.

 BS-3వాహనాలను  BS-4గా మార్చి విక్రయించారనే కేసులో  ఆయన  ఈడీ ముందు హాజరయ్యారు . BS-3 వాహనాలను BS-4 గా మార్చి రిజిస్ట్రేషన్ చేసినట్లు జేసీ ట్రావెల్స్ పై పలు కేసులు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అతని కుమారుడు అశ్విత్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు.