తెలుగు రాష్ట్రాల్లో జేడీ లక్ష్మీ నారాయణగా పేరుపొందిన మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీ నారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు శుక్రవారం( డిసెంబర్ 22) ప్రకటించారు. జైభారత్ నేషనల్ పార్టీ అనే కొత్త పార్టీనీ ప్రారంభిస్తున్నట్లు జేపీ తెలిపారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ..రాజకీయాల్లో మార్పు కోసమే పార్టీ పుట్టిందని వైఎస్సార్సీపీ, టీడీపీ, జనసేనలు పక్కన పెట్టిన ప్రత్యేక హోదా ప్రధానంశంగా చర్చకు తీసుకువస్తామని జేడీ చెప్పారు.
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడతారన్న గత కొంతకాలంగా ప్రచారం సాగింది. అనుకున్నట్లుగానే జేడీ కొత్త పార్టీ జైభారత్ నేషనల్ పార్టీని ప్రకటించారు. ప్రస్తుతం ఏ పార్టీ తో సంబంధం లేని జేడీ సీబీఐ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలకు ముందు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనసేన బ్యానర్ పై విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేశారు . ప్రజాభిమానాన్ని, మద్దతును సంపాదించినప్పటికీ లక్ష్మీనారాయణ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో జనసేన పార్టీనుండి బయటకు వచ్చారు. టీడీపీ, వైసీపీల నుంచి ఆహ్వానాలు వచ్చినా 2024 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయానలనుకుంటున్నట్లు జేపీ ప్రకటించారు.