సీబీఐ మాజీ జేడీ పోటీ చేస్తున్న స్థానం ఇదే

సీబీఐ మాజీ జేడీ పోటీ చేస్తున్న స్థానం ఇదే

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల బరిలో దిగనున్న మరికొంత మంది.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన. ఇప్పటికే కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయగా ఇప్పుడు మరికొంత మందిని ఫైనల్ చేసింది.. ఇందులో ఈ మధ్యే జనసేన పార్టీలో చేరిన సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ వి.లక్ష్మీనారాయణ ఎక్కడినుండి పోటీ చేయనున్నారో ప్రకటించారు పవన్ కళ్యాణ్. విషాఖ పట్నం పార్లమెంట్ స్థానం నుంచి లక్ష్మీనారాయణ పోటీ చేస్తారని తెలిపారు.

వీరితో పాటు ఎన్నికల బరిలో దిగుతున్న పలువురి వివరాలు..
శాసనసభ అభ్యర్థులు: విశాఖ ఉత్తరం – పసుపులేటి ఉషాకిరణ్‌, విశాఖ దక్షిణం – గంపల గిరిధర్‌, విశాఖ తూర్పు – కోన తాతారావు, భీమిలి – పంచకర్ల సందీప్‌, అమలాపురం – శెట్టిబత్తుల రాజబాబు,  పెద్దాపురం – తుమ్మల రామస్వామి (బాబు), పోలవరం – చిర్రి బాలరాజు, అనంతపురం – టి.సి.వరుణ్‌