
వాషింగ్టన్: గ్రీన్‌కార్డులకు సంబంధించి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కార్డులు పొందినోళ్లు అమెరికాలో శాశ్వతంగా ఉండిపోలేరని అన్నారు. గురువారం మీడియాతో జేడీ వాన్స్ మాట్లాడారు. ‘‘గ్రీన్‌కార్డు పొందినంత మాత్రాన అమెరికాలో ఎల్లకాలం ఉండేందుకు హక్కు లేదు. ఇది ఫ్రీ స్పీచ్‌కు సంబంధించిన అంశం కాదు.. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం. మరీ ముఖ్యంగా మాలో ఎవరిని కలుపుకోవాలో అమెరికా పౌరులుగా మేమే నిర్ణయిస్తాం” అని ఆయన వ్యాఖ్యానించారు.
అయితే చట్ట ప్రకారం కొన్ని సందర్భాల్లో గ్రీన్‌కార్డులను రద్దు చేయవచ్చు. నేరాలకు పాల్పడినా, సుదీర్ఘకాలం దేశంలో ఉండకపోయినా, ఇమిగ్రేషన్ రూల్స్ పాటించకపోయినా వాటిని రద్దు చేసేందుకు అవకాశం ఉంది. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఇమిగ్రేషన్ విధానాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలోనే జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ పేరుతో కొత్త స్కీమ్ ప్రకటించారు. రూ.44 కోట్లు చెల్లించి గోల్డ్ కార్డ్ కొనుగోలు చేయవచ్చని, దీని ద్వారా యూఎస్ సిటిజన్‌షిప్ పొందవచ్చని వెల్లడించారు.