
- జేడీయూ నేత కేసీ త్యాగి
- అలాంటి ఆఫర్లను తిరస్కరించామని వెల్లడి
న్యూఢిల్లీ: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కు ఇండియా కూటమి ప్రధానమంత్రి పదవి ఆఫర్ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి తెలిపారు. అయినా.. ఇండియా కూట మి ఆఫర్లను తమ పార్టీ ఎప్పుడో తిరస్కరించిందని ఆయన వెల్లడించారు. శనివారం ఓ వార్తా చానెల్ తో త్యాగి మాట్లాడారు. వచ్చే ఐదేండ్ల పాటు ఎన్డీయేతోనే కలిసి పనిచేస్తామని తమ పార్టీ చీఫ్ నితీశ్ కుమార్ ఇదివరకే స్పష్టం చేశారని ఆయన గుర్తుచేశారు.
‘‘నితీశ్ కు ప్రధానమంత్రి పదవి ఇస్తామని ఇండియా కూటమి ఆఫర్ చేసినట్లు పుకార్లు వ్యాపించాయి. ఎన్డీయేలో మేము చేరినప్పుడే ఇలాంటి పుకార్లకు అడ్డుకట్ట వేయాల్సింది. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు వ్యవహరిస్తున్న తీరుతో మా పార్టీ తీవ్రంగా హర్ట్ అయింది. ఇండియా కూటమి కన్వీనర్ గా ఉండేందుకు అర్హుడు కాదని నితీశ్ ను అప్పుడు తక్కువ చేసిన వారే ఇప్పుడు ప్రధాని పదవి ఇస్తామని ఆఫర్ చేయడం వింతగా ఉంది. అలాంటి ఆఫర్లనూ ఎప్పుడో రిజెక్ట్ చేశాం” అని త్యాగి వ్యాఖ్యానించారు.