అక్టోబర్ 3వ తేదీన బీహార్ భాగల్ పూర్ జవహార్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండలం తన మనవరాలితో వచ్చాడు. అయితే అక్కడున్న జనం అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన ఆయన్ను చూస్తుండిపోయారు. కారణం ఎమ్మెల్యే గోపాల్ మండల్ చేతిలో రివాల్వర్ పట్టుకుని ఉండటమే. అయితే అక్కడున్న డాక్టర్లు, పేషెంట్లు రివాల్వర్ తీసుకురావడం గమనించి కొద్దిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ తర్వాత తాను సీటి స్కాన్ తీయించుకోవడానికి వచ్చానని చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ..
గతంలో తనను నేరస్తులు వెంబడించే వారని..అందుకే ఆయుధాలు తన వెంట ఉంచుకుంటానని ఎమ్మెల్యే గోపాల్ మండల్ చెప్పారు. ఇప్పుడు రాజకీయ నాయకులు తన వెంటే ఉంటున్నారని..అయినా కూడా ఆయుధాలు వదిలి ప్రసక్తే లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీని అవుతానని వెల్లడించారు. ఆత్మరక్షణ కోసమే తన వెంట రివాల్వర్ పెట్టుకున్నానని వివరించారు. తనకు వ్యతిరేకంగా ఏదైనా చేయడానికి ఎవరైనా ధైర్యం చేస్తే కాల్చివేస్తానని హెచ్చరించారు.
ALSO READ : బంపరాఫర్ : రెస్టారెంట్లు, హోటళ్లకు అప్పులు ఇస్తున్న స్విగ్గీ..
చేతిలో రివాల్వర్ పెట్టుకోవడం నా స్టైల్..'
శత్రువుల కోసమే కాదు..రివాల్వర్ పట్టుకోవడం తన స్టైల్ అని ఎమ్మెల్యే గోపాల్ మండల్ తెలిపారు. ఇది తన మద్దతుదారులకు నచ్చిందని చెప్పారు.
గోపాల్ మండల్ వివాదాలు..
ఎమ్మెల్యే గోపాల్ మండల్ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. ఆయన అనేక మార్లు వివాదాస్పద ప్రకటనలు చేసి వార్తల్లో నిలిచారు.
గోపాల్ మండల్ రైలులో లోదుస్తులు ధరించి సంచరించడంతో అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఓ సారి డాక్టర్ రోగికి చికిత్స చేయడంలో ఆలస్యం చేసినందుకు అతన్ని ఏకే 47తో చంపేస్తానని బెదిరించాడు. డీఎస్పీ హెడ్ క్వార్టర్స్‌ను గంగలో పడేస్తామని బెదిరించాడు.
వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యే
గోపాల్ మండల్ భాగల్‌పూర్‌లోని గోపాల్‌పూర్ నుంచి వరుసగా నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గోపాల్ మండల్ భార్య సవితాదేవి రెండేళ్ల క్రితం జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇస్మాయిల్ పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2022లో భాగల్పూర్ మేయర్ ఎన్నికల్లో ఆమె నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.