
కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. రోజుకు లక్షలాది కేసులు, వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనాతో జేడీయూ సీనియర్ లీడర్, మాజీ మంత్రి మేవాలాల్ చౌదరి ఇవాళ ఉదయం చనిపోయారు. మినిస్టర్ కు గత వారం కరోనా పాజిటివ్ వచ్చింది.అప్పటి నుంచి పాట్నాలోని పారాస్ హాస్పిటల్ లో చికిత్స పొందుతుండగా..ఇవాళ తుది శ్వాస విడిచారు. మేవాలాల్ తారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గతేడాది మంత్రి పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి పదవి కోల్పాయారు. బీహార్ లో గడిచిన 24 గంటల్లో 1722 కేసులు వచ్చాయి.
Bihar: Mewalal Choudhary, JDU MLA and former minister, passes away due to #COVID19 at a hospital in Patna.
— ANI (@ANI) April 19, 2021
(File photo) pic.twitter.com/sQFFyBHU0X