జీడిమెట్ల, వెలుగు: ఫేక్ల్యాండ్ డాక్యుమెంట్లు, ఆధార్, ఫాన్ కార్డులు సృష్టించి కోట్ల విలువైన స్థలాలు కబ్జా చేసిన కుత్బుల్లాపూర్సుభాష్నగర్కు చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పద్మజారెడ్డి అలియాస్కుత్బుల్లాపూర్పద్మక్కను జీడిమెట్ల పోలీసులు శుక్రవారం కస్టడీకి తీసుకున్నారు.
ఇటీవల సుభాష్‌నగర్‌లోని 200 గజాల స్థలాన్ని కబ్జా చేయడంతో బాధితుడి ఫిర్యాదుతో ఆమెను పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. పెద్దఎత్తున కబ్జాలకు పాల్పడిందన్న సమాచారంతో ఆమెను ఒక రోజు పోలీసు కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు.
భూ కబ్జాల వెనక ఎవరెవరున్నారు? ఫేక్ డ్యాంకుమెంట్లు ఎలా తయారు చేశారు? ఆమె ఎవరెవరితో కలిసి ఎక్కడెక్కడ కబ్జాలకు పాల్పడిందనే కోణంలో విచారణ జరిగినట్లు తెలిసింది.