IIT JEE అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల

IIT JEE అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డులు విడుదల

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) మద్రాస్ JEE అడ్వాన్స్‌డ్ 2024 అడ్మిట్ కార్డ్‌లను శుక్రవారం( మే17న) విడుదల చేసింది. రిజిస్టర్ చేసుకున్న అభ్య ర్థులు తమ హాల్ టిక్కెట్‌లను అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 ఎగ్జామ్ మే 26, 2024న నిర్వహించ ను న్నారు. ఈ పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఉదయం 9 నుంచి 12 వరకు, పేపర్ 2 అదే రోజు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు జరిగేలా షెడ్యూల్ చేయబడింది. 

IIT JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్  డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..

  • JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్ 2024 అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.inని ఓపెన్ చేయాలి. 
  • అడ్మిట్ కార్డ్  లింక్‌పై క్లిక్ చేయాలి. 
  • అభ్యర్థి పోర్టల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • JEE అడ్వాన్స్‌డ్ అడ్మిట్ కార్డ్ కోసం రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ , మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. 
  • అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోవాలి. 

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసిన తర్వాత  మీ పేరు, పరీక్షా కేంద్రం ఇతర వివరాలను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఏదైన తేడా ఉంటే అభ్యర్థులు అధికారులను సంప్రదించాలి. 

డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్ కార్డ్, చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డు ప్రింటవుట్ (ఆధార్ కార్డ్ , స్కూల్/కాలేజ్/ఇన్‌స్టిట్యూట్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఫోటోతో కూడిన నోటరీ చేయబడిన సర్టిఫికేట్) తప్పనిసరిగా ఉండాలి. పరీక్ష సమయంలో ఇవి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. అది లేకుండా అభ్యర్థి పరీక్షకు హాజరు కావడానికి అనుమతించబడరు.

IIT మద్రాస్ నోటిఫికేషన్ ప్రకారం ఆన్‌లైన్‌లో ఫైనల్ ఆన్సర్ కీ డిక్లరేషన్, ఫలితాలను జూన్ 9న విడుదల చేస్తారు.