JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా

JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా

JEE Advanced 2024 : జేఈఈ అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జేఈఈ మెయిన్ లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకు జేఈఈ అడ్వాన్స్ డ్ (JEE Advanced 2024 ) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నారు. షెడ్యూల్ ప్రకారం JEE Advanced 2024 దరఖాస్తు ప్రక్రియ శనివారం (ఏప్రిల్27) సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అయింది. మే17నుంచి 26 వరకు అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంచుతాయి.

మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ -2 పరీ క్షలు నిర్వహించనున్నారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 ఫలితాలను జూన్ 9, 2024న విడుదల చేస్తారు. 

దరఖాస్తు విధానం, ఫీజు 

ఈ ఏడాది అన్ని కేటగిరీలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్ డ్ 2024 దరఖాస్తు ఫీజును అధికారులు పెంచారు.ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు రూ.1600, ఇతర అభ్యర్థులందరూ రూ. 3200 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 

దరఖాస్తు ఎలా చేయాలి 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://jeeadv.ac.in/ సందర్శించాలి. 
  • అందులో రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. 
  • కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇచ్చిన ఫామ్ లో మీ వివరాలను నమోదు చేయాలి 
  • తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి మీ అప్లికేషన్ సమర్పించాలి. 
  • తదుపరి అవసరా లకోసం అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.